నల్గొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై 1 నుండి నెల రోజుల వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా ఎస్పీ అపూర్వ రావు అధ్వర్యంలో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి అని అన్నారు.
ఈ జూలై 1వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్త ంగా నెల రోజులుగా ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో మూడు సబ్ డివిజన్లో పోలీస్, లేబర్, చైల్డ్ కేర్, రెవెన్యూ, హెల్త్,ఐసిడిఎస్, శిశు సంక్షేమం అధికారులతో సమన్వయంగా కలిసి బృందంగా ఏర్పడి తప్పి పోయిన బాల బాలికలను గుర్తించుట,పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే అ లాంటి వారిని గుర్తించి సంభందిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.
ఎవరైనా బాలల యొక్క స్వే చ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు ఉన్న, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్న పోలీసులకు, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలి అని ఎస్పీ కోరినారు. ఇలాంటి పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్‌కు పంపించడం జరుగుతుందిని అన్నారు.
ఎక్కడైనా బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో డిడబ్ల్యూఒ కృష్ణవేణి, డిసిపివో గణేష్ , సిడబ్లూసి చైర్మన్ -కృష్ణ,నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ లేబర్ ఆఫీసర్, చైల్డ్ లైన్ -ఆంజనేయులు,ఎ.ఎహెచ్.టి.యూ ఎస్‌ఐ గోపాల్ రావు మరియు మిగతా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.