Thursday, January 23, 2025

కార్తీక దీపం పిచ్చి.. పోలీస్‌స్టేషన్ మెట్లెక్కిచ్చే..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వెంకటాపూర్ : కార్తీక దీపం ముగింపు ఎపిసోడ్ ఒకరి వేలు కొరకడానికి కారణమైంది. అంతే కాదు.. ఐపిసి సెక్షన్ 290, 324,లతో వేలు కొరికిన వ్యక్తిపై పోలీసు కేసు నమోదైంది. వినడానికి వింతగానే ఉన్న ఇది వాస్తవం. కాకపోతే కాస్త ఆలస్యంగా వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిళి కిరాణం షాపు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాకపోతే మెగిళికి కార్తీక దీపం సీరియల్ అంటే మహా పిచ్చి. ఈక్రమంలో 1650కు పైగా ఎపిసోడ్‌లు సాగిన కార్తీక దీపం సీరియల్ ఈనెల 24న చివరి ఎపిసోడ్ రాత్రీ 7:30లకు మోదలైంది.

గట్టు మొగిళి సీరియల్‌లో లీనమై సీరియల్ ముగింపు కోసం అసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన తాళ్ళపల్లి వెంకటయ్య తన అవసరం నిమిత్తం మొగిళి ఇంటికి చేరుకున్నాడు. సీరియల్ అయిపోతేనే ఏదైనంటూ మొగిళి కరకండిగా చేప్పాడు ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. చూపుడు వేలు చూపిస్తూ మాట్లాడుతున్న వెంకటయ్యను మొగిళి నేరుగా వచ్చి కొరికేశాడు. సీరియల్‌లో డాక్టర్ బాబు (కార్తీక్) వంటలక్క (దీప) చిటికన వేలు పట్టుకోని ఎడడుగులు నడుస్తున్న సమయంలో ఆచిత్రాన్ని చూడనివ్వడం లేదని ఆగ్రహంతో వెంకటయ్య చూపుడు వేలు కొరికేశాడు. ఇంకేముంది. భాదితుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. కేసు నమోదైయింది. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్‌బాబు కాపురం నిలబడితే ఇక్కడ రెండు కాపురాలు వివాదంలో చిక్కుకున్నాయి. ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాధును ఏస్సై తాజుద్దీన్ ఐపీసి సెక్షన్ 260,324 సెక్షన్ల కింద నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News