Tuesday, February 11, 2025

ముగిసిన ఎంఎల్‌సి నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ గ్రాడ్యుయేట్
ఎంఎల్‌సి స్థానానికి
వెల్లువెత్తిన నామినేషన్లు
నేడు నామినేషన్ల
పరిశీలన పట్టభద్రుల
స్థానానికే కాంగ్రెస్
పరిమితం మూడు
స్థానాల్లో బరిలోకి దిగిన
బిజెపి పోటీకి
దూరంగా బిఆర్‌ఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఉపాధ్యా య, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు నా మినేషన్ల ఘట్టం ముగిసింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నిక కు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు 100మంది అభ్యర్థులు 192సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 18, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సికి 38 నామినేషన్లు సోమవారం దాఖలయ్యాయి. ఈ మూడు ఎంఎల్‌సి స్థానాలకు ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. సోమవారం ముగిసింది. అయితే సోమవారం చివరి రోజు కావడంతో మూడు స్థానాలకు ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం(ఫిబ్రవరి 11) నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.

నామినేషన్లు వేసిన పార్టీలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులు
రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాలకు రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాల తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికే పరిమితం కాగా, బిజెపి మూడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే బిఆర్‌ఎస్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. కరీంనగర్ మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్‌సి అభ్యర్థిగా.. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూరి నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బిజెపి పార్టీ మూడు ఎంఎల్‌సి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి అభ్యర్థిగా నరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్,

ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా అంజిరెడ్డి బిజెపి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ప్రధాన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులందరూ నామినేషన్లు వేశారు. వరంగల్ -ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గానికి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ నియోజకవర్గానికి వంగ మహేందర్ రెడ్డిని పిఆర్‌టియుటిఎస్ తరపున నామినేషన్ దాఖలు చేయగా, అలాగే జాక్టో తరపున వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్, టిఎస్ యుటిఎఫ్, టిపిటిఎఫ్ సంఘాలు వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్ -నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి టిపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ నామినేషన్లు వేశారు.

పోటీకి బిఆర్‌ఎస్ దూరం
మూడు ఎంఎల్‌సి ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్‌సి ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కెసిఆర్ ఎంఎల్‌సి ఎన్నికలను ఉపయోగించుకున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పలు ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలో బిఆర్‌ఎస్ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు అధిష్టానాన్ని కోరినప్పటికీ పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News