Monday, December 23, 2024

ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: పిల్లల ఆరోగ్య సమస్యలు, బుద్ధ్దిమాంద్యాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ నగరం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ సిఐ వెంకటేశ్వర్లు, స్థ్ధానికులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం…. గాదే సతీస్ (39) భార్య గాదే వేద (35) ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు గాదే నిషికేత్ (9), గాదే నిహల్(5)లతో కలిసి కాప్రా డివిజన్ కందిగూడలోని క్రాంతిపార్కు రాయల్ అపార్ట్‌మెంట్ ప్లాట్ నెంబర్107లో నివాసముంటున్నారు. సతీష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, వేద గృహిణి. వీరి పెద్ద కొడుకు భవన్స్‌లో నాలుగవ తరగతి, చిన్న కొడుకు అర్టిజన్ స్కూల్‌లో చదువుతున్నారు.

పుట్టిన దగ్గరి నుంచి పిల్లల ఇద్దరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఇద్దరు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. పిల్లలు ఇద్దరి ఆరోగ్య సమస్యలు తట్టుకోలేని తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం పోటాషియం సైనెడ్ తీసుకుని పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్ధానికుల సమాచారంతో కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News