- Advertisement -
హైదరాబాద్: యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఎనిమి’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విశాల్‌కు 30వ సినిమా కాగా ఆర్యకు 32వ సినిమా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాలిని రవి హీరోయిన్‌గా నటిస్తుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌డీ రాజశేఖర్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది.
‘Enemy’ Movie Telugu Trailer released
- Advertisement -