గురువారం 15,752 మెగావాట్లకు
చేరిన డిమాండ్ వేసవి కన్నా
ముందుగానే గరిష్ఠస్థాయికి
చేరుకున్న విద్యుత్ వినియోగం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఇం కా వేసవికాలం మొదలుకాకున్నా అప్పుడే కరెం ట్ వినియోగం భారీగా పెరిగింది. గత ఏడాది పీక్ సమ్మర్‌లో ఉన్న డిమాండ్ ఈసారి జనవరిలోనే కనిపించింది. దీంతో వేసవిలో విద్యుత్ వి నియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులుఅంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ముందుస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. 15,752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో అత్యధిక విద్యుత్ వినియోగం 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదైతే ఈ సారి మాత్రం ఒక నెల
ముందుగానే పీక్ డిమాండ్‌కు చేరడంతో సమ్మర్‌లో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతున్నదనేది ఉత్కంఠ నెలకొంది. అయితే రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్‌ను తట్టుకునేలా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గడిచిన 13 నెలల వ్యవధిలో రూ.1,000 కోట్ల ఆదా జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే కేవలం గృహ వినియోగం వల్లనే విద్యుత్ డిమాండ్ పెరగలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
తెలంగాణలో ఈసారి వర్షాలు బాగా పడి రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధించింది. అందుకు వ్యవసాయ విద్యుత్ వినియోగం డిమాండ్ చాలా పెరిగింది. దాంతో పాటు పారిశ్రామిక గృహ వినియోగంలో కూడా భారీగా వృద్ధిరేటు కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ జనవరిలో పదివేల మెగావాట్ల విద్యుత్ రిమాండ్ ఏర్పడితే ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 5000 మెగాపట్ల డిమాండ్ ఉంది. మొత్తం కలిపి 15 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఏడాది పీక్ సమ్మర్‌కి కనీసంగా 17000 నుంచి 18 వేల మెగావాట్ల పైచిలుకు డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
యాసంగితో పాటు రానున్న ఎండాకాలంలో డిమాండ్‌కు తగ్గట్టుగా క్వాలిటీ కరెంట్ సప్లై చేయడంపై తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు దృష్టి సారించాయి. విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ రంగ సంస్థలు ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూలు నిర్వహిస్తున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై ఏ విధంగా ఉందనే అంశంపై మానిటర్ చేస్తున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.