Thursday, January 23, 2025

ఇంధన శాఖ ఓఎస్‌డి శ్రీధర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డి)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీగల శ్రీధర్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 60 ఏళ్లు కాగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన ఆయన ట్రాన్స్‌కోలో డివిజినల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శ్రీధర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎనిమిది ఏళ్లుగా ఇంధన శాఖలో ఓఎస్‌డిగా ఆయన పని చేస్తున్నారు. శివంరోడ్డులోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ కాలనీలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన అంత్యక్రియలు ఆదివారం అంబర్‌పేట శ్మశాన వాటికలో జరుగుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News