Friday, December 20, 2024

వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు… 100.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో రోజువారీగా సేకరిస్తున్న చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్మెంట్ డిస్పోజల్ తరహాలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటకు జిహెచ్‌ఎంసి విశేష కృషి చేస్తున్నది. జిహెచ్‌ఎంసి పరిధిలో, చుట్టుపక్కల నగర పాలక సంస్థలలో సేకరిస్తున్న వ్యర్థాల మొత్తాన్ని ఎప్పటికప్పుడు నిల్వ ఉంచకుండా డిస్పోజబుల్ చేసి వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి ఇతర నగర పాలక సంస్థల నుంచి సేకరిస్తున్న రోజు వారీ వ్యర్థాలు ప్రతి రోజు సుమారు 7000 నుంచి 7500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చెత్తను నిల్వ ఉంచకుండా ట్రీట్‌మెంట్ డిస్పోజల్ చేసే ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువుగా మార్చడం, బయోగ్యాస్ తయారు చేయడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం, పొడి చెత్తలో కాలే గుణం కల వ్యర్థాలను పోగు చేసి విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. దీంతో చెత్తతో సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే జవహర్‌నగర్‌లో 19.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని 24మెగావాట్స్‌కు పెంచడం జరిగింది. ఆ తర్వాత మరో 24 మెగావాట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జవహర్‌నగర్‌లో మొత్తం 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ అవుతుంది. దానికి సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పాత 19.8 మెగావాట్ల ప్లాంట్ కోసం రోజుకు సుమారు 1300 టన్నుల నుంచి 1500 టన్నుల వ్యర్థాలు (ఆర్‌డిఎఫ్) ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 6.35 లక్షల ఆర్‌డిఎఫ్‌ను వినియోగించుకుని 225 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

చెత్తతో సంపదను సృష్టించేందుకు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు జిహెచ్‌ఎంసి చర్యలు తీసుకుంది. సేకరించిన చెత్తను వెను వెంటనే నిల్వ ఉంచుకోకుండా మొత్తాన్ని వినియోగించు కోవాలన్నదే జిహెచ్‌ఎంసి ముఖ్య ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో చెత్తతో సంపద సృష్టించేందుకు నగరం నలువైపులా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి అన్ని చర్యలు తీసుకుంది. దిండిగల్ లో మరో 14.5 మెగవాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడం జరగ్గా ఇది మార్చి చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్లాంట్ ఉత్పత్తి ఆరంభించిన నేపథ్యంలో మరో 1000 నుంచి 1200 మెట్రిక్ టన్నుల చెత్తఅవసరం ఉంటుంది.సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో జిహెచ్‌ఎంసి ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ఉత్తర ప్రాంతం నుంచి సేకరించిన చెత్త ప్యారా నగర్‌కు తరలించి విద్యుత్ తయారీకి సుమారు 800 నుంచి 1000 టన్నుల ఆర్‌డిఎఫ్‌ను వినియోగించుకోవడం జరుగుతోంది.

బీబీనగర్‌లో 11 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తి కాగా కంపెనీ యాజమాన్యం ఆర్దిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆ సంస్థను వేరే సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్లాంట్‌ను పునరుద్దరణకు చర్యలు చేపట్టారు. అది త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంట్ ద్వారా 800 నుంచి 900 వరకు చెత్తను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇబ్రహీంపట్నంలో గల యాచారంలో 12 మెగావాట్ల వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. అయితే 12 మెగావాట్ల సామర్థం గల ప్లాంట్‌ను 14 మెగావాట్ల సామర్ధానికి పెంచనున్నారు.

దీనికి ప్రభుత్వ అనుమతి కూడా త్వరలో రానుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు చుట్టు ఉన్న నగర పాలక సంస్థలలో జనాభా పెరగడమే కాకుండా దినదినాభివృద్ది, విస్తరణ జరుగుతున్న క్రమంలో వ్యర్థాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్లుగా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి రోజూవారీ సేకరించిన చెత్తనంతటిని నిల్వ ఉంచకుండా ట్రీట్‌మెంట్ డిస్పోసల్ ద్వారా మొత్తం చెతమ తను వినియోగించాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ద్వారా మొత్తం 100.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News