Saturday, December 28, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి నివాసంలో ముగిసిన ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి నివాసంలో ఇడి సోదాలు ముగిశాయి. గురు వారం తెల్లవారుజామున ఇడి అధికారులు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఇడి సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాం శమైంది. గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఎంఎల్‌ఎకు అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల మేరకు సోదాలు నిర్వహించారు. అయితే గతంలో ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి నిర్వహిస్తున్న మైనింగ్‌పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.341 కోట్లు ప్రభుత్వానికి కట్టలేదు. ఈ మేరకు అక్రమ మైనింగ్ నిర్వహణపై కేసు నమోదు చేసిన అధికారులు మధుసూదన్‌రెడ్డిని రిమాండ్‌కు పంపారు.

బెయిల్‌పై వచ్చిన మధుసూదన్‌రెడ్డి ఇతరుల బినామీల పేరుపై అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మళ్లీ తనిఖీలు నిర్వహిం చినట్లు సమాచారం. హైదరాబాద్ లోని నిజాంపేటలో ఎంఎల్‌ఎ మహిపాల్ రెడ్డి అల్లుడి ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఇడి సోదాలు నిర్వహిం చింది. సోదాల సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మహిపాల్ రెడ్డి ఇంటికి బిఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మహిపాల్ రెడ్డి అల్లుడు తాజాగా రూ.3కోట్ల ఖరీదైన విలాసవంతమైన కారు కొన్నట్లు సమాచారం. కాగా, ఇటీవల మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నా రంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇడి దాడులు జరగడంతో ఈ అంశం నియోజకవర్గమంత టా చర్చకు దారితీసింది.

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేధింపులకు తార్కాణం’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వేధింపులకు తార్కాణం ఇడి దాడులని, తులం బంగారం కూడా పట్టుకోలేక పోయారని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది ఇడి తీరని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మహిపాల్‌రెడ్డి ఇడి సోదాలు ముగిసినానంతరం వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News