Sunday, December 22, 2024

గ్రూప్ -4 రాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

- Advertisement -
- Advertisement -
  • జిల్లాలో 80 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
  • సిపి శ్వేత

సిద్దిపేట: జూలై 1న టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ -4 రాత పరీక్ష జిల్లా కేంద్రంలోని 80 కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సిపి శ్వేత అన్నారు. గురువారం మాట్లాడుతూ 1న జిల్లాలో 80 కేంద్రాల వద్ద సీఆర్పిసీ 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్లు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలన్నారు. పరీక్ష సెంటర్ వద్ద నుండి 100 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షలు రాసే అభ్యర్ధులకు సూచనలు

పరీక్షల సమయాలు పేపర్ 1 ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12.30 గంటల వరకు , పేపర్ -2 మద్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయి. పరీక్షా కేంద్రంలో అభ్యర్ధులకు బయోమెట్రిక్ మాదిరిగి ఫింగర్ ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థుల ఫొటో గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి. పరీక్షకు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసి వేయబడతాయి. ఉదయం పేపర్ 1 పరీక్ష రాసేవారు సమయం 9.45, పేపర్ 2 రాసేవారు 2.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్ధులను ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించబడదు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌లో ఉన్న నిబంధనలు అభ్యర్ధులు చదువుకొని వాటిని పాటించాలని సూచించారు. చివరి నిమిషంలో వచ్చి ఇబ్బంది పడకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్ధులకు సూచించారు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లు, క్యాలిక్యూలేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి, ఘూ వేసుకొని పరీక్షా కేంద్రానికి రావద్దు. అభ్యర్ధులను మెటల్ డిటెక్టివ్ ద్వారా పరీశీలించి పరీక్షా కేంద్రంలోనికి పంపించారు. అభ్యర్ధులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్, బ్లూ, బ్లాక్ , బాల్ పెన్స్ మాత్రమే తీసుకురావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News