Monday, February 10, 2025

భారత్ తో రెండో వన్డే.. భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ బెన్ డకెట్(65), ఫిలిపక్ సాల్ట్(26)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్(34), హ్యారీ బ్రూక్(31)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ అర్ధశతకంతో చెలరేగాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. దీంతో ఇంగ్లండ్ 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్(56), లివింగ్ స్టన్(06)లు ఉన్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News