Sunday, January 12, 2025

కష్టాల్లో న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 54.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన బ్రూక్ 115 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 123 పరుగులు సాధించాడు.

వికెట్ కీపర్ ఓలి పోప్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేశాడు. మిగతా వారు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు, విలియమ్ మూడు, హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కివీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కష్టాల్లోకి నెట్టారు. కెప్టెన్ లాథమ్ (17), డెవొన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (3), మిఛెల్ (6) విఫలమయ్యారు. విలియమ్సన్ (37) ఒక్కడే కాస్త రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ రెండు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News