Sunday, December 22, 2024

విజయం వైపు ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

సెంచరీలతో రాణించిన జో రూట్, హ్యారీ బ్రూక్
విండీస్ ముందు భారీ లక్షం
ట్రెంట్ బ్రిడ్జ్ : రసవత్తరంగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయం వైపు దూసుకెళుతోంది. రెండో ఇన్నింగ్స్ పూర్తి చేసిన ఆతిధ్య జట్టు 400 పైచీలు పరుగులు చేసిన వెస్టిండీస్ ముంది భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆదివారం జో రూట్(122), యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్(109) మెరుపు శతకాలతో రాణించి జట్టును పటిష్టంగా నిలిపారు. ఆదివారం లంచ్ విరామం అనంతరం చెలరేగిన కరీబియన్ బౌలర్లు ఇంగ్లండ్‌ను 425 పరుగులకు కట్టడి చేశారు.

విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 4 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో ఓడిన విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంగే 385 పరుగులు చేయాలి. దీంతో సిరీస్‌ను సమం చేయొచ్చు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్(76), ఓలీ పోప్(51)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరికి తోడు హ్యారీ బ్రూక్(109), జో రూట్(122) కీలక భాగస్వామ్యం నెల్కొల్పారు. వెస్టిండీస్ బౌలర్లపై చెలరేగుతూ వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించారు. దాంతో, ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News