Sunday, December 22, 2024

బెయిర్‌స్టో వీర విధ్వంసం.. ఇంగ్లండ్ సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

ENG Win by 5 wickets against NZ in 2nd Test

నాటింగ్‌హామ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మరో టెస్టు మిగిలివుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 299 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 50 ఓవర్లలోనే ఛేదించింది. జానీ బెయిర్‌స్టో విధ్వంసక సెంచరీతో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లను హడలెత్తించిన బెయిర్‌స్టో 92 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 14 ఫోర్లతో 132 పరుగులు చేశాడు. ఇక బెన్‌స్టోక్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న స్టోక్స్ 70 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో పది ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఓపెనర్ అలెక్స్ లీస్ (44) తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 553, రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 539 పరుగులు సాధించింది.

ENG Win by 5 wickets against NZ in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News