- Advertisement -
టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ జట్టు రికార్డు సృష్టించింది. నిన్న ఒమన్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 48 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 3.1 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. దీంతో టీ20వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
కాగా, గతంలో నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 5 ఓవర్లలో 40 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ జట్టుపై న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో 52, నమీబియాపై ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో 73, ఇంగ్లండ్ జట్టుపై విండీస్ 5.5 ఓవర్లలో 60 పరుగుల టార్గెట్లను ఛేజ్ చేశాయి.
- Advertisement -