Wednesday, January 22, 2025

ఫేస్‌బుక్‌లో వీడియో తీస్తూ ఇంజనీర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫేస్‌బుక్‌లైవ్ పెట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాచారం పోలీస్ స్టేషన్‌లో చోటుచేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం….డిజే ప్లేయర్ హేమంత్, సన కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమచిగురించడంతో ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు, హేమంత్ డిజే ప్లేయర్‌గా పనిచేస్తుండగా, సన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఐదు నెలల నుంచి సనను హేమంత్ శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. రాజస్థాన్‌లో ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తుండగా వేధింపులు ఎక్కువ కావడంతో సన అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కూడా హేమంత్ ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సన నాచారంలో ఉంటున్నది, హేమంత్ అబిడ్స్‌లో డిజే ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే శిక్షణ కోసం వచ్చిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు హేమంత్. అప్పటి నుంచి సనను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. హేమంత్ వేధింపులకు అత్తమామలు కూడా సనను వేధించడం ప్రారంభించారు. వీటిని తట్టుకోలేక ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి తన బాధను చెప్పుకుని లైవ్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న నాచారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్ని సార్లు చెప్పిన మారలేదుః మహ్మద్ హర్షద్, సన తండ్రి
తమ కూతురిని వేధించవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా హేమంత్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సన తండ్రి మహ్మద్ హర్షద్ తెలిపారు. వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ కూతురిని శారీరకంగా మానసికంగా వేధించాడని తెలిపారు.
వేరే యువతితో హేమంత్ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి సన కుమిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సనపై దాడి చేసి ,శారీరకంగా హింసించి, చంపివేస్తానని బెదిరించి టర్కి దేశానికి వెళ్లాడని, అక్కడ వేరే యువతులతో ఫొటోలు దిగి మొబైల్ ఫోన్‌లో స్టేటస్ పెట్టుకున్నాడని తెలిపారు. తన కూతురుకి జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకుండా చూడాలని కోరారు. నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News