హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ ఒకటవ తేదీలోగా ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించానలి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) పేర్కొన్న విధంగానే షెడ్యూల్ తరగతులు ప్రారంభించనున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ఇటీవల ముగిసింది. సీట్లు పొందిన విద్యార్థుల రిపోర్టింగ్ గడువు కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తరగతులు ప్రారంభించేందుకు యూనివర్సిటీలు సమాయత్తమయ్యాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 175 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 79,856 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, ఎంసెట్ తుది విడత, ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు తర్వాత 22,279 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు రాష్ట్రంలో 9 కాలేజీల్లో 100 శాతం సీట్లు కేటాయించారు. ఒక యూనివర్సిటీ, 8 ప్రైవేట్ కాలేజీల్లో 100 శాతం సీట్లకు కేటాయింపు జరిగాయి. ఈసారి ఒక కాలేజీలో జీరో అడ్మిషన్స్ నమోదయ్యాయి.
1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -