23 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. ఈ నెల 23 నుంచి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అర్హులైన విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, తద్వారా విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల నమోదుకు ఎక్కువ సమయం లభిస్తుందని తెలిపారు. కాబట్టి వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్
– ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
– ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
– ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు
– సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
– సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
– సెప్టెంబర్ 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్‌లు
– సెప్టెంబర్ 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
– సెప్టెంబర్ 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
– అక్టోబర్ 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
– అక్టోబర్ 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
– అక్టోబర్ 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
– అక్టోబర్ 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
– అక్టోబర్ 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
– అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ