Friday, November 22, 2024

17 నుంచి ప్రత్యేక విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వానలకు టిఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తాజాగా ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తుది విడత కౌన్సెలింగ్ తర్వాత ఆగష్టు 17 నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుగుతాయని కన్వీనర్, విద్యాశాఖ కార్యచరి వాకాటి కరుణ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. తుది విడతలో ఈనెల 4న స్లాట్ బుకింగ్, 3న ద్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 4 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి..

9న తుది విడత సీట్లు కేటాలుస్తారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 9 నుంచి 11 వరకు కాలేజీల్లో చేరాలి. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈనెల 17న స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 17 నుంచి 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి చేసిన సీట్లు కేటాయిస్తారు. స్పాట్ ప్రవేశాల కోసం అదే రోజున మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News