Wednesday, January 22, 2025

రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం(జూన్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 26 నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే నెల 23 నుంచి 30 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 12వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్ జులై 21 నుంచి మొదలవుతుంది. జులై 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలుపెడతారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించి, ఆగస్టు 7న ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయిస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

జూన్ 26 నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన
జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు
జులై 12న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
జులై 12 నుంచి 19 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్
జులై 21 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
జులై 21,22 తేదీలలో రెండో విడత స్లాట్ బుకింగ్‌లు
జులై 23న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
జులై 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
జులై 28న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
ఆగస్టు 2 నుంచి తుది విడత కౌన్సెలింగ్
ఆగస్టు 3న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
ఆగస్టు 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 7వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
ఆగస్టు 8వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News