- Advertisement -
న్యూఢిల్లీ : కోవిడ్ అనంతరం వాణిజ్య కార్యకలాపాల్లో పురోగతి కనిపిస్తోంది. మార్చి నెలలో దేశీయ ఇంజినీరింగ్ గూడ్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 70.28 శాతం వృద్ధిని సాధించాయి. భారతీయ వ్యాపార ఎగుమతులు ఈ కాలంలో 34 బిలియన్ డాలర్లు నమోదై రికార్డు సృష్టించాయి. 2020 మార్చిలో ఎగుమతులు 21.49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే మార్చి నెలలో దేశీయ ద్రవ్యలోటు 14.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఫిబ్రవరి నెలలో 12.88 బిలియన్ డాలర్ల నుంచి ఇది మరింత పెరిగింది. దేశీయ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఎగుమతులు 34 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిలో నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఎగుమతులు 21.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2021 మార్చిలో ఎగుమతులు 34 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే 58.23 శాతం వృద్ధి నమోదైంది. పెట్రోలియం ఆయిల్, లూబ్రికంట్ (పిఒఎల్) ఎగుమతులు కూడా 2021లో పెరిగాయి.
Engineering exports jump over 70% in March
- Advertisement -