Tuesday, November 5, 2024

6 నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

Engineering final phase counseling from Nov 6th

8న ధ్రువపత్రాల పరిశీలన
6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు
12న తుది విడత సీట్ల కేటాయింపు
20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 6వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొదటి విడతలో సీట్లు పొంది వివిధ కారణాల వల్ల సీటు రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. 6,7 తేదీలలో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 8వ తేదీన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఈ నెల 12వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 12 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతోపాటు ఈ నెల 16వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 17 వరకు కాలేజీలు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాల వివరాలను అప్‌డేట్ చేయాలి.

ఈ నెల 18వ తేదీ వరకు తుది విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్ ద్వారా తమ సీట్లను రద్దు చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. ప్రత్యేక విడతలో 20,21 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి ఈ నెల 24వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు కాలేజీల్లో కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్ ద్వారా తమ సీట్లను రద్దు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్,బి.ఫార్మసీ సీట్ల స్పాట్ అడ్మిషన్లకు ఈ నెల 25వ తేదీన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

తుది విడత షెడ్యూల్
స్లాట్ బుకింగ్: 2021 నవంబర్ 6,7 తేదీలలో
ధ్రువపత్రాల పరిశీలన: 2021 నవంబర్ 8
వెబ్ ఆప్షన్స్:2021 నవంబర్ 6 నుంచి 9 వరకు
తుది విడత సీట్ల కేటాయింపు: 2021 నవంబర్ 12
సెల్ఫ్ రిపోర్టింగ్: 2021 నవంబర్ 12 నుంచి 15 వరకు
కాలేజీల్లో రిపోర్టింగ్ : 2021 నవంబర్ 12 నుంచి 16 వరకు
ప్రత్యేక విడత షెడ్యూల్
వెబ్ ఆప్షన్స్:2021 నవంబర్ 20,21
ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు: 2021 నవంబర్ 24
సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్ : 2021 నవంబర్ 24 నుంచి 26 వరకు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News