Wednesday, January 22, 2025

సిఎంఆర్ కాలేజీలో గుండెపోటుతో సచిన్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ విద్యార్థి తన కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటుకు గురికావడంతో అతడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ శివారులోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సచిన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి తన సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణంలో నడుస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సిఎంఆర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో చనిపోయాడని తెలిపారు. సచిన్ స్వస్థలం రాజస్థాన్‌లోని సుచిత్ర. గతంలో ఏళ్ల యువకుడు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గుండె పోటు రావడంతో చనిపోయాడు. ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోవడంతో మరణించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News