Sunday, December 22, 2024

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Engineering student commits suicide in dundigal

మేడ్చల్: తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కండ్లకోయ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్న బాల మల్లేష్, అరుణ దంపతులు. వీరి పెద్ద కుమారుడు ప్రభజన. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం త్వరగా లేవడం లేదని ప్రభజన్ తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆగ్రహంతో ప్రభజన్ బైక్‌పై ఇంటి నుంచి వెళ్లి దుండిగల్ చెరువు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్ చెరువు వద్ద ద్విచక్రవాహనాన్ని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News