Thursday, December 19, 2024

సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో గల సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం రాత్రి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఎస్‌ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒల్లెమ్ సంజయ్ (21) కండ్లకోయలోని సీఎంఆర్‌ఈసి క్యాంపస్‌లో బిటెక్ సిఎస్‌ఈ 4వ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి మానసిక ఒత్తిడికి గురైన సంజయ్ కళాశాల భవనం 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలైన సంజయ్‌ను సమీపంలోని సిఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం నారాయణ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కళాశాల విద్యార్థుల సమాచారం మేరకు సంజయ్ ముందుగా తన స్నేహితులకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News