Wednesday, January 22, 2025

లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బలయ్యాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు వేధించడంతో తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కొత్తగూడెంకు చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. డబ్బులు అవసరం ఉండడంతో లోన్ యాప్‌లో డబ్బులు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు తరచూ ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు.

అంతటితో ఆగకుండా మనోజ్ బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులకు ఫోన్లు చేసి డబ్బులు కట్టలేదని వేధిస్తున్నారు. దీంతో తన పరువు పోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోస ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని మనోజ్ తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News