Saturday, December 21, 2024

కండక్టర్‌ను కత్తితో నరికిన ఇంజనీరింగ్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

లక్నో: టికెట్ విషయంలో గొడవ జరగడంతో కండక్టర్‌ను ఇంజనీరింగ్ విద్యార్థి కత్తితో నరికి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యునైటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో లరేబ్ హస్మీ అనే విద్యార్థి బిటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. అతడి తండ్రి మహ్మద్ యూనుస్ పౌల్టీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం టికెట్ విషయంలో కండక్టర్ హరికేశ్ విశ్వకర్మతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో బ్యాగ్‌లో నుంచి కత్తి తీసుకొని కండక్టర్ మెడపై వేటు వేశాడు. బస్సులో శబ్ధం రావడంతో వాహనాన్ని డ్రైవర్ మంగళ్ యాదవ్ ఆపాడు. కొన ఊపిరితో ఉన్న కండక్టర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కండక్టర్ మృతి చెందాడు. పోలీసులు హస్మీ కాలేజీలో ఉన్నాడని తెలుసుకొని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులపై హస్మీ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడు గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహ్మద్ ప్రవక్తను బస్సు కండక్టర్ కించపరచడంతో తాను హత్య చేశానని హస్మీ ఓ వీడియో రికార్డు చేసినట్టు సమాచారం. మరో వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ, యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్‌ గురించి ఉన్నట్టు తెలిసింది. యుపి గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మాద్ మర్డర్‌కు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News