Saturday, December 21, 2024

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన పంజాగుట్టలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఇంజనీరింగ్ చేస్తున్న లోకేష్(20) మరో విద్యార్థి కలిసి బైక్‌పై కాలేజీకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి విద్యార్థుల స్కూటీని ఢీకొట్టడంతో లోకేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.

మరో విద్యార్థికి తీవ్ర గాయాలయాయి, వెంటనే పోలీసులు గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను ఢీకొట్టిన బస్సు ఆపకుండా పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు బస్సు కోసం వెతుకుతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News