Wednesday, January 22, 2025

గంజాయికి బానిసై ఇంజినీరింగ్ విద్యారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: గంజాయికి బానిసైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్ద చెర్లపల్లికి చెందిన మోటపోతుల శ్రీనివాస్ కుమారుడు మోటపోతుల విజయ్ కుమార్ గౌడ్ (27)ను గతంలో డిప్లోమా అనంతరం నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించారు. అయితే గంజాయికి బానిసైన విజయ్‌కుమార్ అన్ని సబ్జెక్టులలో కావటంతో తల్లిదండ్రులు చర్లపల్లిలో చికెన్ షాపును పెట్టించి గంజాయి మాన్పించడానికి వివిధ రకాల చికిత్సలు అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ఈ సంవత్సరం తిరిగి మళ్లీ చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో గత నాలుగు నెలల క్రితం నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మెకానికల్ ద్వితియ సంవత్సరంలో చేర్పించి అక్కడే హాస్టల్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుంచి ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ చేరుకొని సమీపంలోని రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయికి బానిసైన విజయ్‌కుమార్ గంజాయి అందకపోవడంతో మనస్తాపంచెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News