Monday, December 23, 2024

కృష్ణా నదిలోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Engineering Student suicide in Gadwal 

జోగులాంబ గద్వాల్: కృష్ణా నదిలోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల పట్టణంలోని నల్లకుంట వీధికి చెందిన గొబ్బూరి శ్రీవర్ష(19) కదులుతున్న రైలు నుండి కృష్ణా నదిలోకి దూకింది. నీరు ప్రవహించని చోట రాళ్లపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. సమచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా, మృతిచెందిన విద్యార్థిని హైదరాబాద్ లోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే, కుటుంబ ఆర్ధిక పరిస్థితులు, అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఇంట్లో సూసైడ్ లెటర్ వ్రాసి పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Engineering Student suicide in Gadwal 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News