మన తెలంగాణ,సిటీబ్యూరో: యునిగేజ్ ప్రవేశపరీక్ష జూన్ 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు, దాదాపు 190 ఇంజనీరింగ్ కళాశాలలు, 50కుపైగా సుప్రసిద్ద ప్రైవేటు, డీమ్డ్ యూనివర్శిటీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్ష కొమెడ్ కె యుజిటి నిర్వహిస్తుంది. ఈసందర్బంగా ఈసంస్ద ప్రతినిధి డా.కుమార్ వివరిస్తూ ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు ఇది ప్రాధాన్యతగా నిలుస్తుందని, ఇటీవల కాలంలో విద్యార్థుల సంఖ్య పరంగా గణనీయమైన వృద్ది కనిపిస్తుందన్నారు. ఈపరీక్ష గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు, ఈసంవత్సరం కూడా భద్రతా చర్యలను పరిగణలోకి తీసుకుని ఈపరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీఆర్‌ఈ ఏవిధంగా ఒకే వేదికగా ఉపయోగపడుతుందో అదే రీతిలో యునిగేజ్‌ను సైతం ఒకే పరీక్షగా దేశంలోని అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి మార్చాలన్నది మాప్రయత్నం. విద్యార్థులకు సౌకర్యవంతమైన, సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహమ్మారి పరిస్దితులలో సైతం 400 కేంద్రాల్లో ఈపరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
యుని గేజ్ ప్రవేశ పరీక్షలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
- Advertisement -