Friday, December 20, 2024

ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన టెక్నాలజీతో ముందుకు సాగాలి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్: మానవ జన్మ ఎంతో విలువైందని మనిషికి మరో జన్మ ఉందో లేదో కానీ ఈ జన్మలోనే చరిత్ర సృష్టించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ మయమైందని ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన టెక్నాలజీలో ముందుకు సాగాలన్నారు.

డిగ్రీ పట్టాలు పొంది ప్లేస్మెం ట్స్ పొందిన విద్యార్థులు అంతటితో ఆగకుండా మరింత ముందుకు సాగే ప్ర యత్నం చేయాలని ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు సృష్టించే స్థా యికి ఎదగాలని కోరారు. అంతకుముందు జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా సమాజంతో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన ఆలోచనలతో, పరిష్కారాలు చూపాలని, సమాజానికి ఉపయోగపడే పరి శోధనలు చేయాలని అన్నారు.

అనంతరం ఉత్తమ విద్యార్థులకు గోల్ మెడల్ బహుకరించారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ విద్యా సంస్థల కార్యదర్శి గోపాల్ రెడ్డి, సీఈఓ అభినవ్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీశైలంరెడ్డి, భూపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News