Wednesday, September 18, 2024

ఇంజినీర్లకు ముచ్చెమటలు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరంపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన జస్టిస్ పి.సి ఘోష్ కమిషన్
సమాధానాల దాటవేత, పొంతనలేని వివరణలపై ఆగ్రహం
బ్యారేజీలకు అనువైన స్థలాలు, డిజైన్లు
ఇష్టారీతిలో మార్చినట్లు కమిషన్ గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యారేజీలను నిర్మిచేందుకు అన్ని పరీక్షలు నిర్వహించి అన్నివిధాల అనువైనదిగా నిర్ధారించి ఎంపిక చేసిన స్థలాన్ని మార్చేశారు… బ్యారేజీల నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్లను ఏమార్చారు..తుది అనుమతుల తర్వాత కూడా డిజైన్లను తమకు అనుకూలమైన రీ తిలో మార్చివేసుకున్నారు.. గోదావరి నదిపై వేలా ది రూపాయల వ్యయంతో నిర్మించిన బ్యారేజీలపై నిజాలు నిగ్గుతేలుతున్నాయి.. లోతుగా, ప్రణాళికా బద్దంగా ,పకడ్భందీగా సాగుతున్న న్యాయ విచారణలో అసలు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

మంగళవారం నాడు జస్టిస్ పిసి ఘోస్ కమిషన్ నిర్వహించిన ఓపెన్‌కోర్టు విచారణ ఎదుట పలువులు ఇంజనీర్లు హాజరయ్యారు.సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ నరేందర్‌తో ప్రారంభించిన ఈ విచారణలో ఎస్‌ఈ సత్యనారాయణ ,బస్వరాజ్ ,దయాకర్ రెడ్డి ,రాజశేఖర్‌లను ఒకరితర్వాత ఒకరిని కమిషన్ విచారించింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంలో అత్యంత కీలకమైన బ్యారేజిలు వాటి డిజైన్లు , మార్పులు చేర్పులు తదితర వాటిపైనే దృష్టిపెట్టిన కమీషన్ ఇంజనీర్లపై సూటిగా ప్రశ్నలు సంధించింది. ఎస్ఆర్ నో అన్న రీతిలో సాగిన విచారణలో కొందరు ఇంజనీర్లు స్పస్టమైన సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు.

మరో ఇంజనీర్ కమీషన్‌కే ఎదురు ప్రశ్నలు వేయటంతో జస్టిస్ పిసిఘోస్ సీరియస్ అయ్యారు. అడిగిన వాటికే బదులు ఇవ్వాలని సూచించారు. అదికూడా సూటిగా ,స్పష్టంగా బదులివ్వాలని సూచించారు. తొలుత విచారణకు హాజరైన ఇంజనీర్లచేత కమీషన్ నిబంధనల ప్రకారం వాస్తవాలు చెబుతామని ప్రమాణం చేయించింది. ఆ తర్వాత విచారణ ప్రారంభించి ప్రశ్నలు అడిగారు. ఇదివరకూ ఇంజనీర్లు కమీషన్ ముందు హాజరై ,సమర్పించిన అఫిడవిట్లను ఈ సందర్భంగా వారి ముందు ఉంచారు. వాటిలో వాస్తవాలు నిర్ధారించాలని సూచించారు. దీనిపై కొందరు ఇంజనీర్లు తడబడ్డారు.

అఫిడవిట్లో పొందుపరిచిన విషయాలను అంగీకరిస్తున్నారా లేదా అని జస్టిస్ పిసిఘోస్ పదే పదే పలువురిని ప్రశ్నించారు. గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన అన్నారం, సుందిళ్ల బ్యారేజిల ప్రతిపాదిత లోకేషన్లు మారాయని , అంతే కాకుండా వాటి డిజైన్లలో కూడా మార్పులు చేసినట్టు ఇంజనీర్లు వెల్లడించారు. తాము తొలుత డిజైన్లను క్షున్నంగా తనిఖీచేసి అంతా బాగున్నట్టు సంతృప్తి చెందాకే తమపై అధికారులకు బ్యారేజిల డిజైన్లను తుది ఆమోదం కోసం అందజేశామని తెలిపారు. కొన్ని మార్పులు చేర్పులు హైపవర్ కమిటీలో చర్చించి నిర్ణయించారని వాటిలో తమ ప్రమేయం లేదని తెలిపారు.డిజైన్లకు పారామీటర్ ఏమిటని జస్టిస్ పిసి ఘోస్ ప్రశ్నించారు. బ్యారేజి నిర్మాణానికి ఎంపిక చేసిన లొకేషన్, గరిష్ట వరద ప్రవాహం, అప్లెక్స్, పాండ్ లెవల్ వంటివాటిని ప్రామాణికంగా తీసుకోవాల్సివుంటుందని ఇంజనీర్లు కమీషన్‌కు వివరించారు.

బ్యారేజీల డిజైన్లను అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు చే ర్పులు ఏమైనా జరిగాయా, డిజైన్లు అప్రూవల్ చేసే ముందు చేసిన తర్వాత అన్ని నిబంధనలు పాటించారా.. హై పవర్ కమిటీ నిబంధనలు క్రైటీరియా ఫాలో అయ్యారా లేదా.. డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత లొకేషన్ లలో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అని కమీషన్ ఇంజనీర్లును ప్రశ్నించింది. కమిషన్ అడిగే ప్రశ్నలకే – కొందరు ఎదురు ప్రశ్నలు వేయటంతో ఇంజనీర్లు ఇచ్చే సమాధానాల జస్టిస్ చంద్ర ఘోష్ సీరియస్ అయ్యారు.అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చితప్పించుకునే ప్రయత్నాలకు కమీషన్ కట్టవేసింది. హై పవర్ కమిటీలో సి డి ఓ అధికారి కూడా సభ్యుడిగా ఉన్నట్టు ఇంజనీర్లు అంగీకరించారు.డిజైన్లు తయారు చేసే ముందు సైట్ విజిట్ ఖచ్చితంగా చేయనక్కర్లేదు అని కమిషన్‌కు ఇంజనీర్లు వెల్లడించారు.

అయితే మేడిగడ్డ లోకేషన్ మాత్రం మారలేదని కమిషన్ ముందు స్పష్టం చేశారు. అంతేకాకుండా డిజైన్లకు సంబంధించి సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్‌తోపాటు కాంటాక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి వేరువేరుగా డిజైన్లు తయారుచేసి ఫైనల్ అప్రూవల్ కు అన్ని ఒకే దగ్గర చేసినట్లు ఇంజనీర్లు వెల్లడించారు. మూడు బ్యారేజీలకు సం బంధించి డిజైన్లను వివరిస్తూ, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణం రాఫ్ట్ కింద పలు సమస్యల వల్ల జరిగిందని కమిషన్ ముందు ఇంజనీర్లు వెల్లడించారు. సిఖెండ్ ఫైల్స్, అలాట్మెంట్ డివియేషన్ వల్ల సమస్య వచ్చిందని ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి వివరించారు.డిజైన్ల అప్రూవల్ తర్వా త అన్నారం బ్యారేజీ మోడిఫికేషన్ జరిగిందని అంగీకరించా రు. హై పవర్ కమిటీ రికమండేషన్ వల్ల అన్నారం సుం దిళ్ల బ్యారేజీల లొకేషన్స్ మారాయని వెల్లడించారు.మంగళవారం మొత్తం వివిధ స్థాయిలకు చెందిన ఐదు మంది ఇంజనీర్లను కమీషన్ విచారించింది.

అఫిడవిట్ అందజేసిన ప్రకాష్
రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్ మంగళవారం నాడు జస్టిస్ పిసి.ఘోస్‌తో భేటి అయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఘటనకు సంబంధించి కమీషన్ ముందు ఇటీవల విచారణకు హాజరైన ప్రకాష్ ఆ నాటి విచారణలో కమీషన్ ముందు వెల్లడించిన అంశాలను అఫిడవిట్ రూపంలో పొందుపరిచి మంగళవారం కమీషన్‌కు సమర్పించారు. కమీషన్ కోరిన అదనపు సమాచారాన్ని కూడా 15పేజీల అఫిడవిట్లో పొందుపరిచి సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News