Tuesday, December 17, 2024

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

England all out at 578 against India on day 3

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 578 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 555/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 23 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. 34 ప‌రుగులతో నిలకడగా ఆడుతున్న బెస్ ను  బుమ్రా పెవిలియన్ పంపించగా, అండ‌ర్స‌న్‌(1) అశ్విన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జ‌ట్టు 190.1 ఓవర్లలో 578 ప‌రుగుల‌ వద్ద ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్స్‌లో బుమ్రా, అశ్విన్ లు చెరో మూడు వికెట్స్ పడగొట్టగా.. న‌దీమ్, ఇషాంత్ శ‌ర్మ తలో రెండు వికెట్లు తీశారు.

England all out at 578 against India on day 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News