Thursday, January 23, 2025

ఇంగ్లండ్ నయా చరిత్ర!

- Advertisement -
- Advertisement -

వరుసగా ఐదు విజయాలు సాధించిన జట్టుగా రికార్డు
యూరో ఛాంపియన్‌షిప్ 2024
జర్మని : ప్రతిష్టాత్మక యూరో ఛాంపియన్ షిప్ ఫుట్‌బాల్ పోటీల్లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. వరుసగా ఐదు విజయాలు నమోదు చేసిన జట్టుగా ఇంగ్లండ్ నయా రికార్డు నెలకొల్పింది. సెర్బియాతో సోమవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 10తో విజయం సాధించింది. దీంతో 2020 నుంచి వరుసగా నాలుగు సీజన్లలో వరుసగా ఐదు సార్లు గెలిచిన జట్టుగా హ్యారీకేన్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. కాగా, ఇంగ్లండ్ 2020లో చెక్ రిపబ్లికన్ జట్టుతో పోరాడి విజయం సాధించగా.. ఆ తరువాత సీజన్‌లో స్కాంట్‌లాండ్‌పై భారీ విజయాన్ని అందుకుంది. అనంతరం జరిగిన సీజన్లలో క్రొయేటియా, స్లొవేకియాలను మట్టికరిపించింది. ఇక తాజాగా జరుగుతున్న సీజన్‌లో పటిష్టమైన సెర్బియా జట్టుపై ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News