కరాచీ: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్.. బౌలింగ్‌లో కంగారూలను కట్టడి చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 351 పరుగులు చేసినా.. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని చేధించేలా బౌలింగ్ చేసింది ఇంగ్లండ్ జట్టు. ఆ తర్వాత ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయానికి చేరువ వరకూ వెళ్లి ఓటమిపాలైంది.
ఇప్పుడు లీగ్ స్టేజీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ జట్టు అదే చెత్త ప్రదర్శనను చూపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జో రూట్(37) మినహా మిగితా బ్యాట్స్‌మెన్లు ఎవరూ 30 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో ఎన్‌సన్ 3, ముల్డర్ 3, మహరాజ్ 2, రబాడా, ఎంగిడి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యన్నే ముందు ఉంచడంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు అఫ్గానిస్థాన్ జట్టు అధికారికంగా టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లే.