లండన్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో రూట్ సేనకు కీలకమైన 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌లు క్రెగ్ ఓవర్టన్ (1), డేవిడ్ మలాన్ (31)లను ఉమేశ్ ఆట ప్రారంభంలోనే వెనక్కి పంపాడు. అయితే ఒలి పోప్, బెయిర్‌స్టోలు అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. బెయిర్‌స్టో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. మరోవైపు మోయిన్ అలీ కూడా ఏడు బౌండరీలతో 35 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన పోప్ ఆరు ఫోర్లతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరల్లో క్రిస్ వోక్స్ అర్ధ సెంచరీతో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడిన వోక్స్ 11 పరుగులతో 50 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితికి చేరుకుంది. భారత బౌలర్లలో ఉమేశ్‌కు మూడు, జడేజా, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ తాజా సమాచారం లభించే సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది.