Wednesday, April 2, 2025

ఫైనల్లో ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

England in the final in U-19 world cup

అండర్19 ప్రపంచకప్

అంటిగువా: అండర్19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ యువ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అఫ్గానిస్థాన్‌తో ఆసక్తికరంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ థామస్ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అయితే బెథెల్ (2), కెప్టెన్ టామ్ ప్రెస్ట్ (17), జేమ్స్ (12), విల్ లుక్‌స్టన్ (11) విఫలమయ్యారు. కానీ చివర్లో జార్జ్ బెల్ ఆరు ఫోర్లతో 56 (నాటౌట్), వికెట్ కీపర్ అలెక్స్ హోర్టన్ 53 (నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. వీరి విజృంభణతో ఇంగ్లండ్ స్కోరు 231 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 215 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ మహ్మద్ ఇషాక్ (43), అల్లా నూర్ (60), అబ్దుల్ హాది 37 (నాటౌట్), బిలాల్ అహ్మద్ (33), నూర్ అహ్మద్ (19) రాణించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయడంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఇంగ్లండ్ తుది పోరులో తలపడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News