Tuesday, April 1, 2025

ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

కరాచీ: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచి విజయం సాధించేందుకు తడబడుతోంది. ఇప్పటికే లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నమెంట్‌ నుంచి వైదొలగిన ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లండ్‌కు సఫారీ బౌలర్ మార్క్ ఎన్‌సన్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్‌(8)ని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లోజెమీ స్మిత్‌ని డకౌట్ చేశాడు. అనంతరం క్రీజ్‌లో కాస్త సెటిల్ అయిన బెన్ డక్కెట్‌(24)ని కూడా ఎన్‌సన్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజ్‌లో హారీ బ్రూక్(8), జో రూట్(4) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News