Tuesday, December 24, 2024

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 67 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 280 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా భారత్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. బెన్ ఫోక్స్ 36 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. టామ్ హార్ట్ లే బెన్ ఫోక్స్, టామ్ హార్ట్ లే 54 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు జాక్ క్రాలే(73), బెన్ డకెట్(28), జానీ బయిర్ స్టో(26) రెహాన్ అహ్మాద్(23), ఓలీ పోప్(23), జోయ్ రూట్ (16), బెన్ స్టోక్స్(11) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో టామ్ హార్ట్ లే(30), షోయబ్ బసీర్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News