Wednesday, January 22, 2025

జోస్ బట్లర్ ఔట్… ఇంగ్లాండ్ 118/5

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 23.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 14 పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మీత్‌కు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. జేసన్ రాయ్ ఆరు పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జేమ్స్ విన్స్ ఐదు పరుగులు చేసి కమ్నీస్ బౌలింగ్‌లో అలేక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో ఔటయ్యాడు. శ్యామ్ బిల్లింగ్స్ 17 పరుగులు చేసి స్టయినీస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జోస్ బట్లర్ 29 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో అగర్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో దావిడ్ మలాన్(42), లైమ్ దవ్సాన్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News