Monday, December 23, 2024

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఇంకా భారత్ 205 పరుగుల ఆధిక్యంలో ఉంది. జాక్ క్రాలే 73 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. జానీ బయిర్‌స్ట్రో 26 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో మైదానం వీడాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు బెన్ డకెట్(28), రెహాన్ అహ్మాద్(23), ఓలీ పోప్(23), జోయ్ రూట్ (16) పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News