Sunday, December 22, 2024

5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో తొలి సెషన్లోనే ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు సంధిస్తున్న బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్తగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ అదరగొడుతున్నాడు. మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. అశ్విన్, జడేజాలు చెరొక వికెట్ పడగొట్టారు.

38 పరుగులుచేసిన బెయిర్ స్టోను అశ్విన్ బౌల్డ్ చేశాడు. అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో ఇండియా రివ్యూకి వెళ్లి వికెట్ సాధించింది. ఇక లంచ్ కు ముందు ఓవర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (3)ను జడేజా ఔట్ చేశాడు. అంతకుముందు డకెట్, ఒలీపోప్, క్రాలేలను ఆకాశ్ దీప్ పెవిలియన్ కు పంపించాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 112.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News