Thursday, December 19, 2024

ఇంగ్లాండ్ 393 డిక్లెర్డ్

- Advertisement -
- Advertisement -

బిర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 78 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 393 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది. రూట్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ భారీగా పరుగులు చేసింది. రూట్ 152 బంతుల్లో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో బయిస్ట్రో (78), జాక్ క్రాలే(61), హరీ బ్రూక్(32), ఓలీ పోప్(31), మోయిన్ అలీ(18), బ్రాడ్(16), డకెట్(12), స్టోక్స్(01), రాబిన్ సన్(17 నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో లయన్ నాలుగు వికెట్లు, హజిల్‌వుడ్ రెండు వికెట్లు, బొలాండ్, గ్రీన్ చెరో ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ డిక్లేర్డ్ చేయడంతో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 4 ఓవర్లలో 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఇంకా ఆస్ట్రేలియా 379 పరుగులతో వెనుకంజలో ఉంది.

Also Read: పుజారాపై వేటు తప్పదా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News