Saturday, November 23, 2024

కదం తొక్కిన రూట్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం, చేతులెత్తేసిన భారత్

లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయింది. 120/0 స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోరి బర్న్ (61), హసీబ్ హమీద్ (68)లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లంచ్ తర్వాత డేవిడ్ మలాన్, కెప్టెన్ రూట్‌లో చెలరేగి ఆడారు. ఇద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు మలాన్, అటు రూట్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు అండగా నిలిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఇద్దరు కుదురు కోవడంతో ఇంగ్లండ్ పటిష్టమైన స్థితికి చేరుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మలాన్ 128 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.
మళ్లీ శతకం బాదేశాడు..
మలాన్ ఔటైనా రూట్ తన జోరును కొనసాగించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాడు. జానీ బెయిర్‌స్టో అండతో రూట్ పోరాటం చేశాడు. ఇద్దరు కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో జో రూట్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక బెయిర్‌స్టో 4 ఫోర్లు, సిక్స్‌తో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. జోస్ బట్లర్ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఇక తాజా సమాచా రం లభించే సమయానికి ఇంగ్లండ్ 128 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ ఇప్పటి వరకు 340 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. కాగా రూట్ 121 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News