- Advertisement -
హిడింగ్లే: లీడ్స్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 132.2 ఓవర్లలో 432 పరుగులు చేసి ఆలౌటైంది. ఎనిమిది వికెట్ల నష్టానికి 418 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు ఆటను ప్రారంభించింది. 14 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది. 354 పరుగుల ఆధిక్యాన్ని భారత జట్టు ముందు ఇంగ్లాండ్ ఉంచింది. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు పడగొట్టగా బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. ఇండియా రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలో 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(11), కె ఎల్ రాహుల్(6) బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇండియా తొలి ఇన్నింగ్స్:78
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 432
- Advertisement -