- Advertisement -
రెండో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమిండియాకు ఇంగ్లండ్ జట్టు 305 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టింది. మొదట నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. తర్వాత దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
బెన్ డకెట్ (65), జో రూట్(69) అర్ధ శతకాలు బాదారు. చివర్లో లివింగ్‌స్టన్ (41) వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, షమి తలో వికెట్ పడగొట్టారు.
- Advertisement -