- Advertisement -
లండన్: ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్‌వుడ్(78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. 1966-82 మధ్య ఇంగ్లాండ్ తరఫున 297 వికెట్లు తీశాడు. ఇప్పటికి ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వికెట్ల తీసిన స్పినర్‌గా రికార్డుల్లో ఉన్నాడు. కౌంటీల్లో కెంట్ తరపున 17 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. కౌంటీల్లో 900 పైగా మ్యాచ్‌లు ఆడి 2523 వికెట్ల తీశాడు. అండర్‌వుడ్ 1969 సెప్టెంబర్ నుంచి 1973 ఆగస్ట్ వరకు ఐసిసి టెస్ట్ బౌలర్స ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో 26 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు. 2006లో క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, 2008లో ఎంసిసి అధ్యక్షుడు, 2009లో ఐసిసి హాల్ ఆఫ్ ఫేమర్‌గా వ్యవహరించారు. అండర్ వుడ్ మృతి పట్ల క్లబ్ అధ్యక్షుడు సైమన్ ఫిలిఫ్ సంతాపం ప్రకటించారు.
- Advertisement -