Wednesday, January 22, 2025

ఇంగ్లాండ్ టార్గెట్ 169

- Advertisement -
- Advertisement -

 

అడిలైడ్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.ఇంగ్లాండ్ జట్టు ముందు టీమిండియా 169 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హార్ధిక్ పాండ్యా,  విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. హార్ధిక్ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు.  భారీగా ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో భారత జట్టు పీకల్లోతు కష్టాలో పడింది.

కెఎల్ రాహుల్ ఐదు పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రోహిత్ శర్మ 27 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లో శ్యామ్ కుర్రాన్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 50 పరుగులు చేసి జోర్డాన్ బౌలింగ్‌లో అదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిష్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టగా రషీద్, వోక్స్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News