Monday, December 23, 2024

విండీస్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : టి20 వరల్డ్ కప్ సెమీస్‌లోనే నిష్క్రమించిన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు సన్నద్దమవుతోంది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టులకు ఇంగ్లీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ తొలి రెండు టెస్టుల సిరీస్‌కు బెన్ స్టోక్స్ సారథిగా వ్యవహరించనున్నాడు. 14 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. కుర్రాళ్లు దిల్లాన్ పెన్నింగ్‌టన్, జేమీ స్మిత్‌లతో పాటు గస్ అట్కిస్సన్‌లకు సెలెక్టర్లు తొలిసారి టెస్టు జట్టులో చోటు కల్పించారు. ఇక ఈ టెస్టు సిరీస్ అనంతరం సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. కాగా, జూలై 10వ తేదీన లారడ్స్ వేదికగా జరిగే తొలి టెస్టులో సిరీస్ షురూ కానుంది. జూలై 18 నుంచి 22 వరకూ జరిగే రెండో టెస్టు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా సాగనుంది.

ఇంగ్లండ్ జట్టు వివరాలు..

బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), గస్ అట్కిన్సన్, జేమ్స్ అండర్సన్, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, డాన్ లారెన్స్, దిల్లాన్ పెన్నింగ్‌టన్, జేమీ స్మిత్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News